Ad Code

ఏనుమాముల మార్కెట్‌లో రికార్డు ధర పలికిన వండర్‌హాట్‌ రకం మిర్చి !


తెలంగాణలోని వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో మిర్చి ధరలు ఘాటెక్కుతున్నాయి. గత రికార్డులను బ్రేక్‌ చేస్తూ గురువారం వండర్‌హాట్‌ రకం మిర్చి క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.38వేల ధర పలికి రికార్డు సృష్టించింది. ఏనుమాముల మార్కెట్‌కు మిర్చి రాబడులు గణనీయంగా తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. కాగా, బుధవారం వండర్‌హాట్‌ మిర్చి రూ.37,100 ధర పలికి ఆల్‌టైం రికార్డు సృష్టించగా, ఒక్క రోజు వ్యవధిలోనే రూ.900 పెరిగి రూ.38వేలు పలకడం విశేషం. వరుసగా రెండు రోజుల నుంచి మిర్చి ధరలు రికార్డు స్థాయికి చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వండర్‌హాట్‌, 341 రకాలను సాగు చేసిన రైతులకు మంచి లాభాలు వస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే యూఎస్‌ 341 రకం మిర్చికి రూ. 26,700, దీపిక రకం మిర్చికి రూ.27వేలు, తేజ రకం మిర్చికి రూ.19,500, పత్తికి రూ.7,630, మినుములకు రూ.8,602, పెసర్లకు రూ.8,352 గరిష్ఠంగా ధరలు పలికాయి.

Post a Comment

0 Comments

Close Menu