మెల్‌బోర్న్ లో మహాత్మా గాంధీ విగ్రహం చోరీ

Tuesday, February 3, 2026

Australia gift from the Indian Council for Cultural Relations in New Delhi international Mahatma Gandhi statue stolen in Melbourne national statue weighs approximately 420-426 kilograms

t f B! P L


ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో మహాత్మా గాంధీ విగ్రహాం చోరీకి గురైంది. గాంధీ కాంస్య విగ్రహాన్ని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ ముందు ఏర్పాటు చేశారు. దీనిని దుండగులు దొంగతనం చేశారు. ఈ విగ్రహం బరువు సుమారు 420-426 కిలోలు ఉంటుంది. న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ దీనిని బహుమతిగా అందించింది. ఆస్ట్రేలియన్ మీడియా ప్రకారం ఈ దొంగతనం సోమవారం అర్థరాత్రి 12.50 గంటల సమయంలో జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఒక వైట్ వ్యాన్‌లో వచ్చి, ముఖానికి ముసుగు కప్పుకుని, యాంగిల్ గ్రైండర్ సహాయంతో విగ్రహాన్ని పునాదుల నుంచి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోల్లో గాంధీ విగ్రహం పాదాల వద్ద కోసి ఉన్నట్లు కనిపిస్తోంది. అక్కడి ఇండియన్ కమ్యూనిటీ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై విక్టోరియా పోలీస్ నాక్స్‌క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ దర్యాప్తు ప్రారంభించింది. స్క్రాప్ మెటల్ వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా కాంస్య విగ్రహాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. ఈ విగ్రహాన్ని 2021 నవంబర్ 12న అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రారంభించారు. ప్రారంభించిన 24 గంటల్లోనే గుర్తు తెలియని వ్యక్తుల విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇప్పుడు విగ్రహమే చోరీకి గురైంది. 

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ