Ad Code

అత్తపై అత్యాచారం చంపిన అల్లుడు


తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో ఉంటున్న ఓ మహిళకు ఇద్దరు సంతానం. అయితే కొన్నాళ్ల క్రితం తన పెద్దకుమార్తెకు తిమ్మాజీపేట మండలానికి చెందిన ఓ యువకునితో వివాహం జరిపించింది. అయితే పెళ్లైన కొన్ని రోజులు బాగానే ఉన్నా.. తర్వాత అల్లుడు తాగుడుకు బానిసై భార్యను వేధించసాగాడు. దీంతో తన కుమార్తెతో పాటు అల్లుడిని కూడా తన దగ్గరకే తెచ్చి పెట్టుకుంది. అయినా అల్లుడి తీరులో ఎలాంటి మార్పురాలేదు. మళ్లీ భార్యను వేధించడం నిత్యం ఆమెతో గొడవలు పడడం చేసేవాడు. ఇటీవల కూడా భార్యతో గొడవపడడంతో ఆమె తమ సమీప బంధువల ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో ఇంట్లో కేవలం అత్త మాత్రమే ఉంది. ఇదే అదునుగా భావించిన అల్లుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్తపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించడంతో ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి రెండో కుమార్తె ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Post a Comment

0 Comments

Close Menu