Ad Code

ప్రధానమంత్రి కార్యాలయం ''సేవాతీర్థ్'' ప్రారంభం


న్యూఢిల్లీ లోని కొత్త ప్రధానమంత్రి కార్యాలయం  ''సేవాతీర్థ్'' ప్రారంభం తర్వాత  కొత్త ఆఫీస్ నుంచి ప్రధాని నరేంద్రమోడీ కీలక పథకాన్ని ప్రారంభించారు. ప్రమాద బాధితులకు తక్షణ సాయం అందేందుకు రూ. 1.5 లక్షల నగదు రహిత చికిత్స కోసం పీఎం రహత్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రధాని మోడీ ఆమోదం తెలిపారు. ఈ స్కీమ్ ద్వారా ప్రమాద బాధితులకు రూ. 1.5 లక్షల వరకు నగదు లేకుండా చికిత్స లభిస్తుంది. తక్షణ వైద్య సహాయం లేకపోవడం వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు ఈ స్కీమ్ పనికొస్తుంది. ప్రధాని మోడీ ఈ స్కీమ్ తో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ''లఖ్‌పతి దీదీ'' లక్ష్యాన్ని ఆరు కోట్లకు రెట్టింపు చేయడం, వ్యవసాయం మౌలిక సదుపాయాల నిధి వ్యయాన్ని రూ. 1 లక్ష కోట్ల నుంచి రూ. 2 లక్షల కోట్లకు రెట్టింపు చేయడం వంటి ఉన్నాయి. బ్రిటిష్ కాలం నుంచి ప్రధాని కార్యాలయానికి అడ్రస్‌గా ఉన్న సౌత్ బ్లాక్ ఇప్పుడు ''సేవాతీర్థ్''కు మారింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఈ కొత్త సముదాయాన్ని శుక్రవారం ప్రధాని ప్రారంభించారు. ఈ సముదయాంలో పీఎంఓ తో పాటు కీలక మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఉంటాయి.

Post a Comment

0 Comments

Close Menu