హైదరాబాద్ లోని అత్తాపూర్ ఏరియాకు చెందిన ప్రవీణ్ (30) అనే యువకుడికి పెళ్లి కావడం లేదు. వయసు పెరుగుతున్నా పెళ్లి కాకపోవడం, ఎన్ని సంబంధాలు చూసినా సెట్ కాకపోవడంతో డిప్రెషన్ లో కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మనస్తాపం చెందిన అతను ఆదివారం మధ్యాహ్నం 20 అంతస్తుల బిల్డింగ్ మీదకు వెళ్లి అక్కడ నుంచి కిందకు దూకేశాడు. తీవ్ర గాయాలైన ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రవీణ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పెళ్లి కావడం లేదని డిప్రెషన్ లోకి వెళ్లడమే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు.