శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడుగా వున్న ఉన్నికృష్ణన్ పొట్టికి బెయిల్ మంజూరైంది. ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసిన 90 రోజుల లోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయడంలో విఫలమైనందున ఈ బెయిల్ వచ్చింది. శబరిమల గర్భగుడి తలుపుల ఫ్రేముల నుండి బంగారం అదృశ్యం కావడానికి సంబంధించిన రెండో కేసులో ఉన్నికృష్ణన్ పొట్టికి బెయిల్ మంజూరైంది. ద్వారపాలక విగ్రహం కేసులో కూడా అతనికి బెయిల్ లభించింది. కొల్లాంలోని విజిలెన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ షరతులలో భాగంగా పొట్టి ఒక్కొక్కటి రూ. 2 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలి. కేరళ విడిచి వెళ్లకూడదు. శబరిమల ఆలయం ఉన్న పతనంతిట్ట జిల్లాలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు. ప్రతి మంగళవారం, శుక్రవారం దర్యాప్తు అధికారులకు రిపోర్ట్ చేయాలి.
శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసు : ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్‌కు బెయిల్ మంజూరు
Telugu Lo Computer
0
Comments
Post a Comment