Ad Code

జగిత్యాల మున్సిపాలిటీ అభ్యర్థుల ఎంపికలో అన్యాయం జరిగింది !


తెలంగాలోని జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో అభ్యర్థుల ఎంపికలో అన్యాయం జరిగిందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి ఏకంగా 30 టికెట్లు కేటాయించారని, తన వర్గానికి కేవలం 20 టికెట్లు మాత్రమే ఇచ్చారని ఆయన ఆరోపించారు. "ఈ చర్యతో నా మెడ కోశారు" అంటూ ఆయన తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరిగిందని ఆయన వాపోయారు. జీవన్ రెడ్డి అసంతృప్తి వార్త తెలియగానే జగిత్యాలలోని ఆయన నివాసానికి కార్యకర్తలు, స్థానిక నేతలు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. టికెట్లు దక్కని అభ్యర్థులు తమ ఆవేదనను ఆయన ముందు వెళ్లగక్కుతున్నారు. ఈ పరిణామం జగిత్యాల కాంగ్రెస్‌లో అలజడి సృష్టిస్తోంది. 

Post a Comment

0 Comments

Close Menu