దయం పూట నారింజ, బత్తాయి వంటి పండ్లను తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఉదయాన్నే తింటే కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. అలాగే అరటిపండ్లను కూడా తినకూడదు. ఎందుకంటే ఇందులో మెగ్నీషియం, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఖాళీ కడుపుతో తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగడమే కాకుండా, శరీరంలో పోషకాల సమతుల్యత దెబ్బతింటుందన్నారు. వీటితో పాటు మామిడి పండ్లను కూడా ఖాళీ కడుపుతో తీసుకోకూడదని చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుందని, వీటిని ఖాళీ కడుపుతో తింటే షుగర్ లెవల్స్ వేగంగా పెరుగుతాయని చెప్పారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారు ఈ పండ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పుల్లని పండ్లను ఖాళీ కడుపుతో కాకుండా, ఏదైనా తిన్న తర్వాత తీసుకోవడం మంచిది. పండ్లను పాలతో కలిపి తీసుకోకపోవడమే ఉత్తమం. పండ్లను కోసిన వెంటనే తినేయాలి. ఎక్కువ సేపు నిల్వ ఉంచిన ముక్కలను తినకూడదు. పండ్లను జ్యూస్ రూపంలో కంటే, ముక్కలుగా కోసుకుని బాగా నమిలి తింటేనే పూర్తి పోషకాలు అందుతాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత లేదా మధ్యాహ్నం భోజనానికి ముందు తింటే జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.