Ad Code

పెద్దపులి దాడిలో హెడ్ కానిస్టేబుల్ మృతి


రుణాచల్ ప్రదేశ్ లో పోలీస్‌ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న చిక్సెంగ్‌ మాన్‌పుంగ్‌ పై పెద్దపులి దాడి చేసి చంపివేసింది. చిక్సెంగ్‌ మాన్‌పుంగ్‌ రేడియో ఆపరేటర్‌గా విధులు నిర్వహించాడు. లోయర్ దిబాంగ్ వ్యాలీ జిల్లా మయోడియాలో ఆయన డ్యూటీ నిర్వహించేవాడు. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ పెద్దపులి హఠాత్తుగా ఆయనపై దాడి చేసింది. ఆ దారిన వెళ్లే వాహనదారులు రోడ్డు పక్కన బైక్‌ పడి ఉండడం చూసి యాక్సిడెంట్‌ కావొచ్చని పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఉదయం అటుగా వెళ్లిన వాళ్లకు పక్కన పొదల్లో రక్తపు మడుగులో ఆయన మృతదేహం కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా అది పెద్దపులి చేసిన దాడిగా నిర్ధారించుకున్నారు. చిక్సెంగ్‌ కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన తర్వాత అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఓ ఆడపులి మూడు కూనలతో ఆ ప్రాంతంలో సంచరిస్తుందని గుర్తించారు. కూనల్ని రక్షించుకునే క్రమంలోనే అది దాడి చేసి చంపి ఉంటుందని భావించారు. ఈ ఘటనతో మయోడియా ప్రాంతంలో రాత్రి పూట ద్విచక్ర ప్రయాణాలపై నిషేధం విధించారు. అయితే రెండు రోజుల తర్వాత అదే ప్రాంతంలో ఒక పులి మృతదేహం తుపాకీ గాయాలతో కనుగొన్నారు. ఇది ప్రతీకార చర్య కావచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. అదే సమయంలో వేటగాళ్ల దాడి అయ్యి ఉండొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu