మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఒక బాలిక 11వ తరగతి చదువుతున్నది. పరిచయం ఉన్న ఇద్దరు వ్యక్తులు నాలుగు కార్లలో పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికపై లైంగిక దాడిని ఒక వ్యక్తి ఐఫోన్‌లో రికార్డ్ చేశాడు. ఈ వీడియోను ఆమెకు షేర్ చేశారు. రూ.40,000 ఇవ్వాలని ఆ బాలికను వారిద్దరూ బ్లాక్‌మెయిల్ చేశారు. లేకపోతే దీనిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు. ఈ మేరకు ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రధాన నిందితుడు ఆసఫ్ అలీ ఖాన్, అతడి అనుచరుడు మేజ్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. థార్ ఎస్‌యూవీతో సహా నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు. మేజ్ ఖాన్ వీడియో రికార్డ్ చేసిన ఐఫోన్ స్వాధీనం కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. అతడితో సంబంధాలున్న హెడ్ కానిస్టేబుల్ కీలక సమాచారం లీక్ చేయడంతో ఆయనను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.
0 Comments