హర్యానా కురుక్షేత్ర లోని నిట్ లో తెలంగాణ, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంకు చెందిన అంగోత్ శివ అనుమానాస్పదంగా మృతి చెందాడు. శివ నిట్ కురుక్షేత్రలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నిన్న మధ్యాహ్నం హాస్టల్ గదికి వెళ్లిన శివ భోజనానికి రాకపోవడంతో తోటి విద్యార్థులు గదికి వెళ్లి చూశారు. ఈ క్రమంలో, శివ.. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉన్నట్లు సమాచారం. కళాశాల యాజమాన్యం దీనిని ఆత్మహత్యగా అనుమానిస్తోంది. విద్యార్థి మృతదేహాన్ని నిట్ సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే, శివ మృతిపై కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిట్ కురుక్షేత్ర క్యాంపస్ ముందు కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. కనీసం ఆస్పత్రి లోపలికి కూడా సిబ్బంది అనుమతించని పరిస్థితి. తమ కుమారుడి మృతిపట్ల కాలేజీ యాజమాన్యం సరిగా స్పందించకపోవడంపై శివ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కురుక్షేత్ర లోని నిట్ లో అనుమానాస్పద విద్యార్థి మృతి
Tuesday, February 17, 2026
haryana national Rangareddy district Shiva was studying computer science engineering in the first year Suspicious death of student in NIT Kurukshetra telangana
No comments:
Post a Comment