భారత్ - నేపాల్ మధ్య బస్సు సర్వీస్ లు ప్రారంభమయ్యాయి. ఈ బస్సు న్యూఢిల్లీ నుండి బేనీ వరకు నడుస్తుంది. ఢిల్లీ నుండి బేనీకి చేరుకోవడానికి సుమారు 27 గంటల సమయం పడుతుంది. మొత్తం ప్రయాణ దూరం 1,400 కిలోమీటర్లు. ఇది టూరిస్టులకు మంచి అవకాశం. హిందూ, బౌద్ధమతస్థులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ముక్తినాథ్. ఇప్పటివరకు అక్కడికి వెళ్లాలంటే విమానాలు లేదా మల్టీ-లెగ్ ప్రయాణాలతో భక్తులు ఎంతో ఇబ్బంది పడేవారు. ఈ సమస్యకు పరిష్కారంగా భారత్-నేపాల్ సరిహద్దుల మధ్య ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి నేపాల్-భారత్ ఫ్రెండ్ షి ప్ బస్సు సర్వీసు ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య రైల్వే ప్రయాణాలు జరుగుతున్నప్పటికీ డైరెక్ట్ బస్సు సర్వీస్ ఇదే మొదటిసారి. జయనగర్-కుర్థా రైలు మార్గం ఇప్పటికే అందుబాటులో ఉండగా, రక్సాల్ నుండి ఖాట్మండు వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి చర్చలు జరుగుతున్నాయి.
0 Comments