మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తన భర్తకు విడాకులు ఇచ్చి, ఆయనతో సన్నిహితంగా ఉంటున్న మహిళ నుంచి రూ.కోటిన్నర తీసుకుంది. భర్తకు విడాకులు ఇచ్చిన మహిళ మాట్లాడుతూ “నా భర్త మరో మహిళ మోజులో పడ్డాడు. అప్పటి నుంచి మా కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయి. నేను, పిల్లలు నలిగిపోతున్నాం” అని చెప్పింది. ఆమె భర్తకు 52 ఏళ్లు. అతడు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి. అతడు పనిచేసే డిపార్ట్‌మెంట్‌లోని మరో ఉద్యోగిని (54)తో డేటింగ్‌లో ఉంటున్నాడు. దీంతో అతడి భార్య విడాకుల కోసం కోర్టుకు వెళ్లింది. తన భర్తతో తిరిగిన మహిళ నుంచి రూ.కోటిన్నర తీసుకుని, సెటిల్‌మెంట్ చేసుకుని విడాకుల పేపర్లపై సంతకాలు చేసింది.
0 Comments