Ad Code

భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం : ఇది మధ్యంతర ఒప్పందం కోసం ఒక ప్రేమ్ వర్క్ మాత్రమే !


భారత్-అమెరికా జారీ చేసిన ఉమ్మడి ప్రకటన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదరలేదని స్పష్టం చేస్తోందని మాజీ ఆర్థికమంత్రి చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది తాత్కాలిక ఒప్పందం కూడా కాదని, ఇది 'మధ్యంతర ఒప్పందం కోసం ఒక ప్రేమ్ వర్క్ (చట్రం) మాత్రమేనని తేల్చిచెప్పారు. ఈ ప్రకటనలోని పేరా 2తో పాటు బుల్లెట్ పాయింట్లను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. గతేడాది ఏప్రిల్ 2, సెప్టెంబర్ 5, 2018 మార్చి 8న అమెరికా జారీ చేసిన ఆదేశాల్ని చూడకపోతే గతేడాది జూలై 30, 2019 మే 17న ఆ దేశం ఇచ్చిన హామీలు అర్ధం కావన్నారు. ఇందులో ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉందని, అది ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం అమెరికాకు అనుకూలంగా ఎక్కువగా వంగి ఉందని, అసమానత స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ఉదాహరణకు భారత్ అన్ని అమెరికా పారిశ్రామిక వస్తువులు, విస్తృత శ్రేణి ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తొలగిస్తుంది లేదా తగ్గిస్తుందని, అయితే అమెరికా భారత్ నుండి వచ్చే వస్తువులపై 18 శాతం సుంకాన్ని విధిస్తుందని గుర్తుచేశారు. ఈ వస్తువులలో వస్త్రాలు, తోలు వస్తువులు, సేంద్రీయ రసాయనాలు మొదలైనవి ఉంటాయన్నారు. మధ్యంతర ఒప్పందం విజయవంతంగా ముగిసిన తర్వాత మాత్రమే అమెరికా సుంకాన్ని తొలగిస్తుందన్నారు. కొన్ని విమానాలు మరియు విమాన భాగాలపై తప్ప ఉక్కు, రాగి, అల్యూమినియంపై అమెరికా సుంకాలు స్పష్టంగా కొనసాగుతాయన్నారు. సెక్షన్ 232 కింద అమెరికా చేస్తున్న దర్యాప్తు కొనసాగుతుందని, ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం ఆ దర్యాప్తుకు లోబడి ఉంటుందని స్పష్టం చేశారు. కాబట్టి ఇందులో సంబరాలు జరుపుకునేందుకు ఏముందన్నారు. 

Post a Comment

0 Comments

Close Menu