షాదీ డాట్ కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్‌ను మరో రెండు వారాల పాటు అరెస్టు చేయవద్దు అని సుప్రీంకోర్టు ఆదేశించింది. మాట్రిమోనియల్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా జరిగిన ఫ్రాడ్ కేసులో కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. ఈ కేసులో అనుపమ్ మిట్టల్‌తో పాటు మరో ఇద్దరికి కూడా రక్షణ కల్పిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఎన్వీ అంజరియాతో కూడిన ధర్మాసనం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కనపెట్టింది. అయితే ఈ కేసును మళ్లీ హైకోర్టుకు పంపించింది. తాత్కాలిక బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాలని మిట్టల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ షాదీ డాట్ కామ్ పై కేసు నమోదు చేసింది. షాదీ డాట్‌కామ్ ద్వారా ఫేక్ ప్రొఫైల్‌ను సృష్టించిన ఓ వ్యక్తి తనను 11 లక్షలు మోసం చేసినట్లు ఆ మహిళ తన ఫిర్యాదులో ఆరోపించింది. యూజర్ సమాచారాన్ని షాదీ డాట్ కామ్ సరైన రీతిలో వెరిఫై చేయలేదని ఆ మహిళ పేర్కొన్నది.
0 Comments