Ad Code

ఫ్లిప్‌కార్ట్‌ లో శాంసంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్ పై భారీ డిస్కౌంట్‌


ఫ్లిప్‌కార్ట్‌ లో శాంసంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్ ను ప్రస్తుతం భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ ను అందిస్తుంది. ఈ ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్‌ రూ.30999 ధరకు విడుదల కాగా ప్రస్తుతం  రూ.18999 ధరకు అందుబాటులో ఉంది. అదే విధంగా 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ రూ.33999 ధరకు లాంచ్‌ అయింది. ప్రస్తుతం రూ.20999 కు కొనుగోలు చేయవచ్చు. అంటే సుమారుగా రూ.12 వేల తగ్గింపును పొందవచ్చు. ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ ఫోన్ Exynos 1380 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు Mali G68 ను కూడా అమర్చి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 6.1 OS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుందని శాంసంగ్‌ హామీ ఇచ్చింది. ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.6 అంగుళాలు FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్రొటెక్షన్‌ ను పొందుతుంది. Awesome లిలక్‌, Awesome ఐస్‌ బ్లూ, Awesome నేవీ కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది.  ఈ ఫోన్‌ OIS ( ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ ) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్, 5MP మ్యాక్రో లెన్స్, 13MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్‌ 25W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌ సెట్‌ 5G, 4G, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP67 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. భద్రత కోసం ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్లు ఉన్నాయి. 

Post a Comment

0 Comments

Close Menu