Ad Code

ఆరు నెలల్లో 50 లక్షల మంది కొనుగోలు, రూ.26.55 కోట్లు దాటిన లావాదేవీలు


ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్ పాస్‌ గత ఆగస్టు 15 నుంచి ప్రారంభమైంది. ఇది అమలులోకి వచ్చిన మొదటి రోజు సాయంత్రం 7:00 గంటల వరకు సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు వార్షిక పాస్‌ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. టోల్ ప్లాజాలలో దాదాపు 1.39 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి. ఆ తరువాత కూడా ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌కు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఇప్పుడు తాజాగా 50 లక్షల మంది దీనిని కొనుగోలు చేసినట్లు ప్రారంభించిన ఆరు నెలల్లోనే 26.55 కోట్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం ప్రస్తుతం జాతీయ రహదారుల  నెట్‌వర్క్‌లో కార్ల ద్వారా జరిగే మొత్తం లావాదేవీల్లో సుమారు 28 శాతం ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్ పాస్ ద్వారానే జరుగుతున్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే, చండీగఢ్ ఈ పాస్ వినియోగంలో అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం వార్షిక పాస్ లావాదేవీల్లో 14 శాతం చండీగఢ్ నుంచే నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఢిల్లీ (11.5 శాతం) ఉన్నాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని బిజ్వాసన్ ఫీ ప్లాజా అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ దాదాపు 57 శాతం కార్ల రాకపోకలు యాన్యువల్ పాస్ ద్వారానే జరుగుతున్నాయి. ముండకా ఫీ ప్లాజా (ఢిల్లీ ఎన్‌సీఆర్) & జిన్‌ఝోలీ ఫీ ప్లాజా (సోనిపట్) వద్ద కూడా సుమారు 53 శాతం నాన్-కమర్షియల్ వాహనాలు ఈ పాస్‌ను ఉపయోగిస్తున్నాయి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు & ఎక్స్‌ప్రెస్‌వేలలోని సుమారు 1,150 టోల్ ప్లాజాలలో ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్ పాస్‌ను అమలు చేసింది. వాహనదారులు ఫాస్టాగ్‌లో డబ్బులు అయిపోయిన ప్రతిసారి రీచార్జ్‌ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి రూ.3 వేలు చెల్లించి వార్షిక ఫాస్టాగ్‌ రీచార్జ్‌ చేసుకుంటే 200 ట్రిప్పులు లేదంటే ఏడాది గడువుతో (ఏది ముందు అయితే అది) ఈ పాస్‌ వర్తిస్తుంది. వాహనదారులు కొత్తగా ఫాస్టాగ్‌ కొనాల్సిన అవసరం లేకుండా.. ప్రస్తుతం వాహనంపై అతికించిన ఫాస్టాగ్‌కే ఆ మొత్తాన్ని రీచార్జ్‌ చేసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రాజ్‌మార్గ్‌ యాత్ర యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.

Post a Comment

0 Comments

Close Menu