Ad Code

42 రోజుల చెల్లుబాటుతో బీఎస్ఎన్ఎల్ రూ. 197 ప్రీపెయిడ్ ప్లాన్‌


క్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారి కోసం బీఎస్ఎన్ఎల్ రూ. 197 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది బడ్జెట్ ధరలో ఆల్ రౌండ్ ప్రయోజనాలను అందించే బెస్ట్ ప్లాన్‌గా గుర్తింపు పొందింది. ఈ ప్లాన్ 42 రోజుల చెల్లుబాటులో ఉంటుంది. చెల్లుబాటు కాలానికి గాను 300 నిమిషాల ఉచిత లోకల్/STD కాల్స్ ఆఫర్ చేస్తుంది. వ్యాలిడిటీ కాలానికి 4GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు. 100 SMS ప్రయోజనాలు అందుతాయి. ఈ ప్లాన్ అపరిమిత  కాలింగ్ లేదా డైలీ డేటా ప్లాన్ కాదు. ఇందులో ఇచ్చే ఉచిత నిమిషాలు లేదా డేటా ముగిసిన తర్వాత అదనపు ఛార్జీలు వర్తిస్తాయి: లోకల్ కాల్ నిమిషానికి రూ. 1, STD కాల్ నిమిషానికి రూ. 1.30. వీడియో కాల్ కి నిమిషానికి రూ. 2, లోకల్ SMS 80 పైసలు, నేషనల్ SMS రూ. 1.20. అదనపు హై స్పీడ్ డేటా కావాలంటే ఒక MBకి 25 పైసలు వసూలు చేస్తారు.

Post a Comment

0 Comments

Close Menu