థాయ్‌లాండ్, శోంక్లా పట్టణంలోని పాఠశాలలో అగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 34 మంది మృతి చెందారు. మృతుల్లో 22 మంది చిన్నారులు ఉన్నారు. మాజీ పోలీస్ అధికారి ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. పాఠశాల ముగిసే సమయంలో ప్రాంగణంలోకి ప్రవేశించిన దుండగుడు కాల్పులు జరిపాడు. పాఠశాలలోకి చొరబడి ఉపాధ్యాయులు, చిన్నారులను బందీలుగా చేసుకుని కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ దాడి థాయ్‌లాండ్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటనగా అధికారులు పేర్కొన్నారు.
0 Comments