తెలంగాణలో ఈనెల 25వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 25వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9గంటల నుంచి 12 గంటలకు పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ ఐఏఎస్ కృష్ణాదిత్య ఇంటర్ పరీక్షల పై కీలక విషయాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,97,075మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. మొదటి సంవత్సరం లో 4,89,126 విద్యార్ధులు పరీక్ష రాయనున్నారు.. రెండో సంవత్సరం లో 5,07,949 విద్యార్ధులు మంది పరీక్ష రాయనున్నారు.. మొత్తం 1,495 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎగ్జామ్ సెంటర్లుగా ప్రభుత్వ కళాశాలలు 404, ప్రభుత్వ రంగంలో ఉండే ఎయిడెడ్ కాలేజీలు 221, ప్రైవేట్ జూనియర్ కళాశాలు 863, ఇతర స్కూల్స్, కాలేజీలు 7సెంటర్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రానికి అరగంట ముందే విద్యార్థులు చేరుకోవాలని సూచించారు. 5 నిమిషాలు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకున్నా అనుమతిస్తామని అన్నారు. కానీ ఆలస్యంగా రావడం వల్ల విద్యార్ధులు నష్టపోతారని హెచ్చరించారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 28,500మంది ఇన్విజిలేటర్లు ఉండనున్నారు.. అన్ని శాఖల నుంచి మంచి సహకారం అందుతోందని తెలిపారు. అన్ని విభాగాల సమన్వయంతో పరీక్షలు నిర్వహించనున్నామని తెలిపారు. ప్రతి సెంటర్ కూడా నిఘా నేపథ్యంలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. 30వేల సీసీకెమెరాల నిఘా లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రాక్టికల్ పరీక్షల్లో ఇబ్బంది అయిన 5 సెంటర్లను తొలగించామని తెలిపారు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు మాల్ ప్రాక్టీస్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. 12 గంటలకు ముందు పేపర్ తీసుకోవడానికి వీలు లేదన్నారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.
0 Comments