Ad Code

మహిళల రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీ : యూఏఈపై ఘోరంగా ఓడిపోయిన భారత్-ఏ జట్టు


హిళల రైజింగ్ స్టార్స్ 2026  టోర్నీని భారత్-ఏ జట్టు ఘోర పరాజయంతో ప్రారంభించింది. గ్రూప్-ఏలో భాగంగా శుక్రవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన భారత్-ఏ 7 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇషా ఒజా (72 నాటౌట్, 2/30) ఆల్‌రౌండ్ షోతో భారత్-ఏ పతనాన్ని శాసించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్- ఏ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులు చేసింది. అనుష్క శర్మ (45 బంతుల్లో 7 ఫోర్లతో 47), తనూజ కన్వార్ (25 బంతుల్లో 5 ఫోర్లతో 34) మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ రాధాయాదవ్ (7)తీవ్రంగా నిరాశపర్చింది. యూఏఈ బౌలర్లలో సమైరా ధరింధర్కా(3/40) మూడు వికెట్లు తీయగా, వైష్ణవే మహేష్(2/13), ఇషా ఓజా(2/30) రెండేసి వికెట్లు పడగొట్టాడు. సురక్ష కొట్టే, అతిగే సిల్వా చెరో వికెట్ తీసారు. అనంతరం యూఏఈ 19.2 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ ఇషా ఓజా(61 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 72 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించింది. సమైరా(31 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34) కీలక ఇన్నింగ్స్ ఆడింది. భారత బౌలర్లలో రాధా యాదవ్, ప్రేమ రావత్, తనూజ కన్వార్ తలో వికెట్ తీసారు.


Post a Comment

0 Comments

Close Menu