Ad Code

ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ దాడి : 15 మంది దుర్మరణం


క్రెయిన్‌లోని నిప్రో నగరాన్ని లక్ష్యంగా చేసుకుని రష్యా నిర్వహించిన డ్రోన్ దాడిలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా గనుల్లో పనిచేసే మైన్ కార్మికులుగా అధికారులు గుర్తించారు. పనిముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. డ్రోన్ దాడి ఘటనను ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు. పౌరులే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోందని ఆయన ఆరోపించారు. అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించి రష్యాపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

Post a Comment

0 Comments

Close Menu