నేపాల్ లోని బైటడి జిల్లా పూర్చౌడి మున్సిపాలిటీలో పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు లోయలో పడడంతో 13 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 45 మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. 16 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 60 మంది బస్సు భావానే నుంచి బజాంగ్‌కు వెళ్తుండగా బడ్గౌన్ మోడ్ వద్ద బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ఘటనా స్థలంలో చనిపోగా ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు కిసానా దత్త జోషి(46), బిస్నా దత్తా జోషి(41), కేశవ్ రాజ్ జోషి(40), బసంత రాజ్ రటాలా(40), పుష్ప అవస్థి(40), బసంత జోషి(35), దీపక్ రాజ్ జోషి(28), కేశవ్ రాజ్ భట్ట(27), సుశీల్ జోషి(15), అశోక్ రాజ్ జోషి(13) లుగా గుర్తించారు.
0 Comments