Ad Code

ఫిబ్రవరి 13న టెక్నో పోవా కర్వ్ 2 విడుదల


దేశీయ మార్కెట్లో పోవా కర్వ్ 2ను ఫిబ్రవరి 13న టెక్నో విడుదల చేయనుంది. ప్రత్యేక లాంచ్ ఈవెంట్‌గా ఉంటుందా? లేక సాఫ్ట్ లాంచ్‌కే పరిమితమవుతుందా? అన్నదానిపై టెక్నో ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ గ్రాండ్ లాంచ్ నిర్వహిస్తే, టెక్నో అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లేదా యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్ స్ట్రీమ్ చేసే అవకాశం ఉంది. పోవా కర్వ్ 2 ధరకు టెక్నో ఇప్పటివరకు అధికారిక ధరను వెల్లడించలేదు. అయితే లీకులు ప్రకారం.. రూ.15,000 నుంచి రూ.20,000 మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. గతంలో వచ్చిన Pova Curve 5G రూ.15,999 (6GB RAM + 128GB) నుంచి ప్రారంభమైంది. అదే ధర శ్రేణిని కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇందులో Space 2.0 డిజైన్ లాంగ్వేజ్ అందించారు. ఫ్యూచరిస్టిక్ లుక్‌తో కూడిన ఈ ఫోన్ వెనుక భాగంలో కర్వ్‌డ్‌, మ్యాట్ ఫినిష్ రియర్ ప్యానల్‌ను కలిగి ఉంది. కొత్తగా త్రిభుజాకార (ట్రయాంగ్యులర్), అసిమెట్రిక్ కెమెరా మాడ్యూల్ డిజైన్ ఆకట్టుకుంటుంది. వెనుక భాగంలో చిన్న LED ఫ్లాష్, పోవా బ్రాండింగ్ కనిపిస్తాయి. ఈ ఫోన్ బ్లాక్, సిల్వర్, వైలెట్ అనే మూడు కలర్ ఆప్షన్లలో రానుంది.

Post a Comment

0 Comments

Close Menu