Ad Code

ఎన్‌హెచ్‌ఏఐ క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్ : రూ. 1000 విలువైన ఫాస్ట్‌ట్యాగ్‌ రీఛార్జ్ బహుమతి


ఎన్‌హెచ్‌ఏఐ 'క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్' పేరుతో ప్రారంభించింది. దీని ద్వారా రూ. 1000 విలువైన ఫాస్ట్‌ట్యాగ్‌ రీచార్జ్ ఉచితంగా పొందవచ్చని ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమం 2026 జూన్ 30 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ఉద్దేశ్యం జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలలోని మరుగుదొడ్ల పరిశుభ్రతను మెరుగుపరచడం. జాతీయ రహదారులపై ప్రయాణించే వారిలో చాలామంది టోల్ ప్లాజాలలో ఉన్న మరుగుదొడ్లను ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల పరిశుభ్రత లోపించడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎన్‌హెచ్‌ఏఐ ప్రజల సహకారం కోరుతోంది. ఎవరైనా టోల్ ప్లాజాలలో మరుగుదొడ్డి అపరిశుభ్రంగా ఉందని గమనిస్తే ఫోటో తీసి రాజ్‌మార్గయాత్ర యాప్ లేటెస్ట్ వెర్షన్ ద్వారా జియో-ట్యాగ్ చేసిన ఫోటోలను పేరు, ప్రదేశం, వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్  & మొబైల్ నంబర్‌తో సహా వివరాలతో అప్‌లోడ్ చేయాలి. సంబంధిత అధికారులు ఫోటోలను పరిశీలించి.. సమాచారం నిజమని ధృవీకరిస్తే, ఫోటోలను షేర్ చేసిన వారి వెహికల్ నెంబర్‌కు రూ. 1000 విలువైన ఫాస్ట్‌ట్యాగ్‌ రీఛార్జ్ బహుమతిగా లభిస్తుంది. ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని రహదారులపై పరిశుభ్రతను మెరుగుపరచడానికి సహకరిస్తారని ఎన్‌హెచ్‌ఏఐ భావిస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu