Ad Code

బిడ్డకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్న తల్లి !


హైదరాబాద్ లోని సరూర్‌నగర్ నివాసం ఉంటున్న యశ్వంత్‌ రెడ్డితో సుష్మితకు రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీళ్లకు ప్రస్తుతం 10 నెలల బాబు కూడా ఉన్నాడు. అయితే కొద్దిరోజులుగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు కుటంబ సభ్యులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం తన 10 నెలల కుమారుడికి కుమారుడికి విషం ఇచ్చి, తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కూతురు సుష్మిత, మనవడు చనిపోయారన్న మరణవార్త విన్న సుష్మిత తల్లి లలిత షాక్‌కు గురైంది. దీంతో ఆమె కూడా ఆత్మహత్యకు యత్నించింది. ఆఫీస్‌ నుంచి ఇంటికొచ్చిన యశ్వంత్‌కు ఇంట్లో భార్య, కొడుకుతో పాటు అత్త అపస్మారక స్థితిలో కనిపించారు. దీంతో వాళ్లను వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే భార్య, కుమారుడు మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాధితురాలి మృతికి భర్త వేధింపులే కారణమని, సుష్మితది ఆత్మహత్య కాదు.. హత్య అని, ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్ బయటపెట్టాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu