అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీబీఎస్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ ఉరి శిక్షలు లాంటి చర్యలకు దిగితే మేము చాలా కఠినంగా స్పందిస్తామన్నారు. ఉరి శిక్షల గురించి నేను ఇప్పటివరకు వినలేదు. కానీ అలా చేస్తే మీరు కొన్ని పరిణామాలు చూడాల్సి ఉంటుంది. ఇరాన్ అటువంటి చర్యలకు దిగితే మేము చాలా కఠినంగా స్పందిస్తాం" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, ఇరాన్ సుప్రీం నేత ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజలు తమ నిరసనలు కొనసాగించాలని ట్రంప్ సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. నిరసనకారులకు అవసరమైన సహాయం అందుతోందని కూడా ఆయన తెలిపారు. నిరసనకారులపై హింస ఆపేంత వరకు ఇరాన్ అధికారులతో ఎలాంటి చర్చలు జరపబోమని స్పష్టం చేసిన ట్రంప్, ఇప్పటికే నిర్ణయించిన సమావేశాలను కూడా రద్దు చేసినట్లు వెల్లడించారు. డిసెంబర్ 28 నుంచి ఇరాన్లో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. ఇరాన్ దేశంలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణాన్ని నిరసిస్తూ ప్రజలు రోడ్లపైకి దిగారు.మొదట నెమ్మదిగా ప్రారంభమైన ఈ ఉద్యమం క్రమంగా ఉగ్రరూపం దాల్చింది. పరిస్థితి అదుపు తప్పడంతో భద్రతా దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.అధికారిక లెక్కల ప్రకారం సుమారు 2 వేల మంది నిరసనకారులు మృతి చెందగా, అంతర్జాతీయ మీడియా అంచనాల ప్రకారం ఈ సంఖ్య 12 వేల వరకు ఉండవచ్చని సమాచారం. టెహ్రాన్ నగర వీధుల్లో అనేక చోట్ల మృతదేహాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే డజన్ల కొద్దీ భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో ప్రస్తుత పరిస్థితి, ప్రపంచ అంతర్జాతీయ భద్రతకు దాని వల్ల కలిగే వినాశకరమైన పరిణామాల గురించి అమెరికా తెలుసుకోవాలని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.ఇరాన్లో డోనాల్డ్ ట్రంప్ నిరసనకారులను రెచ్చగొట్టడంపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనల మధ్య, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన మధ్యప్రాచ్యంలో మరో యుద్ధం జరిగే అవకాశాన్ని రేకెత్తించింది. ట్రంప్ నిరసనకారులకు బహిరంగంగా మద్దతు ఇచ్చారు. కాగా ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో ట్రంప్ బాహ్య జోక్యాన్ని రష్యా ఖండించింది. ఇరాన్ పై సైనిక దాడుల బెదిరింపులు ఆమోదయోగ్యం కాదని రష్యా అభిప్రాయపడింది. మధ్యప్రాచ్యంలో ప్రస్తుత పరిస్థితి మరియు ప్రపంచ అంతర్జాతీయ భద్రతకు దాని వినాశకరమైన పరిణామాల గురించి అమెరికా తెలుసుకోవాలని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది."జూన్ 2025లో ఇరాన్ పై జరిగిన దాడి పునరావృతం కావడానికి సాకుగా అశాంతిని రెచ్చగొట్టాలని ప్లాన్ చేస్తున్న వారు, మధ్యప్రాచ్యంలో పరిస్థితికి, ప్రపంచ అంతర్జాతీయ భద్రతకు ఇటువంటి చర్యల వినాశకరమైన పరిణామాల గురించి తెలుసుకోవాలి" అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
0 Comments