తెలంగాణలోని వరంగల్ జిల్లా హసన్‌పర్తి మండలంలోని చింతగట్టు రైల్వే ట్రాక్ పై దూడ రాజు ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. నడికుడ మండలం చరపల్లికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు దూడ రాజు (24) హన్మకొండలోని ఒక ప్రైవేటు పాఠశాలలో వార్డెన్ గా పని చేస్తు న్నాడు. ఆదివారం రాత్రి రాజు బైక్ పై వచ్చి చింతగట్టు రైల్వే గేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న రైలుకు అడ్డంగా నిలబడి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ద్విచక్ర వాహనం వరంగల్ క్రిస్టియన్ కాలనికి చెందిన రాపర్తి కోర్నెలు కుమారుడు అనిల్ కుమార్ పేరు పై రిజిస్ట్రేషన్ ఉండగా రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గుర్తు పట్టలేకుండా ఉన్న మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ద్విచక్ర వాహనం పై ఉన్న చలన్ల ఆధారంగా మృతుడు నడికుడ మండలం చరపల్లికి చెందిన దూడ రాజుగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్పులబాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్తులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటన స్థలాన్ని రైల్వే హెడ్ కానిస్టేబుల్ సాజిద్ ఆలీ పరిశీలించి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. రైల్వే జి ఆర్ పి ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
0 Comments