Ad Code

మేడారం మహా జాతరకు ప్రత్యేక రైళ్లు !


నెల 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ నెల 28 నుంచి ఈ ప్రత్యేక రైళ్లను నడుపనుంది. సికింద్రాబాద్‌, మంచిర్యాల్‌, సిరిపూర్‌కాగజ్‌నగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం ప్రాంతాల నుంచి మేడారం జాతర ప్రత్యేక రైళ్లు వరంగల్‌, కాజీపేటల వరకు నడవనున్నాయి. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు నడిచే మేడారం జాతర ప్రత్యేక రైళ్లు పూర్తిగా అన్‌ రిజర్వుడ్‌ జనసాధారణ రైళ్లని జాతర వెళ్లే భక్తులు ఈ రైళ్లను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఈనెల 28, 30, ఫిబ్రవరి 1 తేదీల్లో సికింద్రాబాద్‌ -మంచిర్యాల్‌- సికింద్రాబాద్‌ ప్రత్యేక రైళ్లు కాజీపేట మీదుగా కాజీపేట మీదుగా నడుస్తాయి. సికింద్రాబాద్‌-మంచిర్యాల్‌ రైలు(07495) ఉదయం 5.45 గంటలకు సికిందరాబాద్‌లో బయలుదేరి ఉదయం 8.45 గంటలకు కాజీపేటకు, మధ్యాహ్నం 1.30 గంటలకు మంచిర్యాల్‌ చేరుకుంటుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు మంచిర్యాల్‌-సికిందరాబాద్‌ రైలు (07496) మంచి ర్యాల్‌లో బయలుదేరి రాత్రి 8 గంటలకు కాజిపేటకు, రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఈనెల 29, 31 తేదీల్లో సికింద్రారాబాద్‌-సిరిపూర్‌ కాగజ్‌ నగర్‌-సికింద్రాబాద్‌ మేడారం (07497/07498) ప్రత్యేక రైళ్లు నడుస్తాయి, ఈ తేదీలలో మేడారం జాతర ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్‌ నుంచి ఉదయం ఉదయం 5.45 గంటలకు బయలుదేరి ఉదయం 8.45 గంటలకు కాజీపేటకు, మధ్యాహ్నం 2 గంటలకు సిరిపూర్‌ కాగజ్‌నగర్‌ చేరుకుంటాయి. అదే రోజు మద్యాహ్నం 2.30 గంటలకు సిరిపూర్‌ కాగజ్‌నగర్‌లో బయలుదేరి రాత్రి 7.45 గంటలకు కాజిపేటకు, రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటాయి. నిజామాబాద్‌-వరంగల్‌-నిజామాబాద్‌ మేడారం జాతర ప్రత్యేక రైళ్లు (07498/07499) ఈ నెల 28 నుంచి 31 వరకు రాకపోకలు సాగిస్తాయి. ఈ రైళ్లు నిజామాబాద్‌లో ఉదయం 7.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్‌ చేరుకుంటాయి. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2.40 గంటలకు వరంగల్‌లో బయలుదేరి అదే రాత్రి 10.30 గంటలకు నిజామాబాద్‌ చేరుకుంటాయి. ఇక.. నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఖమ్మం-కాజీపేట-ఖమ్మం మేడారం ప్రత్యేక రైళ్లు (07503/07504) ఉదయం 10 గంటలకు ఖమ్మంలో బయలుదేరి మధ్యాహ్నం 12.50 గంటలకు కాజీపేట చేరుకుంటాయి. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కాజీపేటలో బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు ఖమ్మం చేరుకుంటాయి. ఆదిలాబాద్‌-కాజీపేట (07501)మేడారం జాతర ప్రత్యేక రైలు ఈ నెల 28న రాత్రి 11.30 గంటలకు ఆదిలాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు (29 తేదీ) ఉదయం 11.45 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది. అలాగే కాజిపేట-ఆదిలాబాద్‌ (07502)మేడారం ప్రత్యేక రైలు ఈ నెల 29వ తేది మధ్యాహ్నం 1.15 గంటలకు కాజీపేటలో బయలుదేరి మరుసటి రోజు (30వ తేదీ) తెల్లవారు జామున 4 గంటలకు ఆదిలాబాద్‌ చేరుకుంటుంది.

Post a Comment

0 Comments

Close Menu