Ad Code

మరో ఐదేళ్లలో యూరోపియన్ బ్యాంకింగ్ రంగంలో భారీ మార్పులు ?


సాంకేతిక విప్లవం ఇప్పుడు ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థ పునాదులను కదిలిస్తోంది. నిన్నటి వరకు మనుషులు చేసిన గణాంకాలు, విశ్లేషణలు ఇప్పుడు క్షణాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి చేస్తోంది. ఈ వేగం వెనుక వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. తాజాగా మోర్గాన్ స్టాన్లీ విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం, మరో ఐదేళ్లలో యూరోపియన్ బ్యాంకింగ్ రంగంలో భారీ మార్పులు సంభవించబోతున్నాయి. ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించిన ఈ నివేదిక ప్రకారం, 2030 నాటికి యూరప్‌లోని సుమారు 35 ప్రధాన బ్యాంకుల్లో 10 శాతం ఉద్యోగ నియామకాలు తగ్గే అవకాశం ఉంది. అంటే దాదాపు 2 లక్షల మందికి పైగా బ్యాంక్ ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. బ్యాంకులు తమ కార్యకలాపాలను డిజిటలైజ్ చేయడం, భౌతిక శాఖలను తగ్గించి ఏఐ వైపు మొగ్గు చూపడమే దీనికి ప్రధాన కారణం. ఈ ఏఐ దెబ్బ ప్రధానంగా బ్యాక్-ఆఫీస్ ఆపరేషన్స్, రిస్క్ మేనేజ్మెంట్, మరియు కంప్లయెన్స్ విభాగాలపై పడనుంది. గంటల కొద్దీ సమయం పట్టే స్ప్రెడ్‌షీట్ కాలిక్యులేషన్స్, డేటా విశ్లేషణలను అల్గోరిథమ్స్ మనుషుల కంటే వేగంగా, నిర్దుష్టంగా చేయగలవని బ్యాంకులు భావిస్తున్నాయి. ఈ మార్పుల ద్వారా బ్యాంకులు సుమారు 30% సామర్థ్యాభివృద్ధిని పొందే అవకాశం ఉంది. ఈ పరిస్థితి కేవలం యూరప్‌కే పరిమితం కాలేదు. అమెరికాలోని దిగ్గజ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్ ఇప్పటికే “OneGS 3.0” పేరుతో భారీ ఏఐ ప్రాజెక్టును చేపట్టింది. క్లయింట్ ఆన్‌బోర్డింగ్ నుండి రిపోర్టింగ్ వరకు అన్ని పనులను ఆటోమేట్ చేయడమే దీని లక్ష్యం. దీని ఫలితంగా 2025 చివరి వరకు కొత్త నియామకాలను నిలిపివేయడంతో  పాటు, ఇప్పటికే ఉన్న సిబ్బందిలో కోతలు ఉంటాయని హెచ్చరించింది. కొన్ని బ్యాంకులు ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేశాయి. డచ్‌కు చెందిన ఏబీఎన్ అమ్రో బ్యాంక్ 2028 నాటికి తన సిబ్బందిలో 1/5 వంతు (20%) తొలగించాలని నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఉద్యోగమూ సురక్షితం కాదు” అని సోసియేట్ చసే బ్యాంక్ సీఈఓ కుండబద్దలు కొట్టారు. అయితే, జూనియర్ బ్యాంకర్లు కనీస బేసిక్ పనులు నేర్చుకోకుండా అంతా ఏఐ పైనే ఆధారపడితే, భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన నాయకత్వ కొరత ఏర్పడుతుందని జేపీ మోర్గాన్ ఎగ్జిక్యూటివ్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Post a Comment

0 Comments

Close Menu