Ad Code

ఏపీ టెట్ ఫలితాలు విడుదల


ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించే డీఎస్సీ పరీక్షకు అర్హత సాధించేందుకు గతేడాది నిర్వహించిన టెట్ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వం ఫలితాలు తెలుసుకునేందుకు వీలుగా వివరాలను వెల్లడించింది. ఈ ఏడాది డీఎస్సీ పరీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో టెట్ పరీక్షకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇవాళ టెట్ ఫలితాలు విడుదల కావడంతో డీఎస్సీ పరీక్ష నిర్వహణపై ఆశలు పెరిగాయి. గతేడాది ఏపీలో నిర్వహించిన టెట్ పరీక్షకు మొత్తం 2 లక్షల 71 వేల 692 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2 లక్షల 48 వేల 427 మంది పరీక్ష రాశారు. పరీక్షల అనంతరం ప్రాథమిక కీ, తుది కీ విడుదల చేశారు. అనంతరం ఇవాళ ఫలితాలు వెల్లడించారు. ఈసారి టెట్ పరీక్షలు రాసిన వారిలో కేవలం 97560 మంది మాత్రమే ఉత్తీర్ణులు అయ్యారు. అంటే ఇది 39.27 శాతం. అలాగే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు 31886 మంది పరీక్ష రాయగా.. ఇందులో 15239 మంది పాసయ్యారు. ఈసారి టెట్ పరీక్ష ఫలితాలను తెలుసుకునేందుకు అధికారులు వెబ్ సైట్ లింక్స్ ను, వాట్సాప్ నంబర్ ను విడుదల చేశారు. టెట్ పరీక్షలు రాసిన అభ్యర్ధులు https://tet2dsc.apcfss.in/ లేదా https://cse.ap.gov.in/ వెబ్ సైట్లలోకి వెళ్లి టెట్ పరీక్ష ఫలితాలను తెలుసుకోవచ్చు. అలాగే ఏపీ ప్రభుత్వ మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే అవకాశం కల్పించారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ప్రభుత్వం త్వరలో నిర్వహించే డీఎస్సీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. 

Post a Comment

0 Comments

Close Menu