విద్యార్థినిని కిడ్నాప్ చేసిన ఇద్దరు యువకులు : కదులుతున్న కారులో బాలికపై అత్యాచారం


రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లా నాపాసర్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల బాలిక 12వ తరగతి చదువుతున్నది. జనవరి 6న ఉదయం ఆ బాలిక స్కూల్‌కు బయలుదేరింది. మార్గమధ్యలో ఇద్దరు యువకులు ఆమెను అడ్డగించి ఆ బాలికను కిడ్నాప్‌ చేసి కారులో తీసుకెళ్లారు. కదులుతున్న కారులో ఒకరు తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కొన్ని గంటల తర్వాత పొరుగు గ్రామంలోకి ఆ కారు ప్రవేశించింది. అనుమానించిన స్థానికులు ఆ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. ఆ యువకులు బాలికను కారు నుంచి బయటకు తోసి పారిపోయారు. ఆ గ్రామస్తులు బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు చేరుకుని ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. జనవరి 11న ఆ బాలిక కుటుంబం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులైన యువకులను గుర్తించి అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం