హైదరాబాద్ లోని నాంపల్లి లో శనివారం మధ్యాహ్నం ఓ ఫర్నీచర్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేసేందుకు అగ్నిమాపకశాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనతో పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ కలెక్టకర్ హరిచందన, పోలీస్ కమిషనర్ సజ్జనార్ పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్ కష్టమవుతోందని కలెక్టర్ అన్నారు. ఈ ప్రాంతానికి ఎవరూ రావొద్దని, వాహనదారులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కోరారు. ఈ ప్రమాదం జరిగిన భవనాన్ని హిందీ ప్రచార సభ పేరుతో నిర్మించినట్లు అధికారులు నిర్ధారించారు. పలువురు దాతల విరాళాలతో 1960లో నిర్మించినట్లు తెలిపారు. అచ్యుత్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ల్యాండ్‌లో భవనం నిర్మించినట్లు పేర్కొన్నారు. కొన్నేళ్లుగా అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లడంతో షాపులు ఏర్పడినట్లు గుర్తించారు. ఈ భవనంలో ఏర్పాటు చేసిన దుకాణాలను తక్షణమే తొలగించాలని హైకోర్టు గతంలోనే ఆదేశాలు సైతం ఇచ్చినట్లు వెల్లడించారు. హైకోర్టు ఆదేశాలను అక్రమార్కులు బేఖాతరు చేస్తూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.
0 Comments