Ad Code

ఫోన్ ట్యాపింగ్ కేసు : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు జారీ


తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌లోని ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలంటూ కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. సీఆర్‌పీసీ 160 కింద నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో ఈ నోటీసులను అందజేశారు సిట్ అధికారులు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై సిట్ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించనున్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు ఉన్నతాధికారుల్లో కొందరు ఇప్పటికే అరెస్ట్ అవగా.. ఇప్పుడు నాయకుల విచారణ జరుగుతోంది. ఈ కేసులో ఇటీవలే మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు.. ఆయన్ను కూడా విచారించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన్ను పలు అంశాలపై విచారించిన అధికారులు.. కీలక సమాచారం రాబట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

Post a Comment

0 Comments

Close Menu