Ad Code

కారును ఢీకొన్న కంటైనర్ లారీ : కారును కొద్ది దూరం ఈడ్చుకెళ్లిన కంటైనర్


తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సృజన్ మోహన్ రెడ్డి-పద్మ దంపతులు కారులో హైదరాబాద్ బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారును నియంత్రణ లేని వేగంతో వస్తున్న కంటైనర్ లారీ వెనకాల నుంచి ఢీకొనడంతో కంటైనర్‌కు అడ్డంగా మళ్లింది. అయినప్పటికీ కంటైనర్ డ్రైవర్ కారును కొద్ది దూరం ఈడ్చుకెళ్లడంతో, కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలిద్దరూ ప్రాణాలతో బయటపడతామా లేదా అన్న భయంతో వణికిపోయారు. దారిన వెళ్తున్నవారు తమ వాహనాలను ఆపి కారులో ఉన్న భార్యాభర్తలిద్దరిని జాగ్రత్తగా బయటకు తీయడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, ప్రమాదానికి గురైన కారును స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వివరించారు.

Post a Comment

0 Comments

Close Menu