Ad Code

ధరణి అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తున్నాం : భూ భారతిలో అవకతవకలకు కారణం ధరణి పోర్టల్


తెలంగాణాలోని ఖమ్మంలో శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్స్ లు పంపిణి చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భూభారతిలో అవకతవకలకు కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ధరణియే కారణం అని అన్నారు. అగ్రికల్చర్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ ఫీజుల విషయంలో ప్రతిపక్ష నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. భూభారతి రిజిస్ట్రేషన్ అవకతవకల విలువ తనకు తెలిసి రూ.3 కోట్ల90 లక్షలు మాత్రమేనన్నారు. ఈ అవకతవకలపై కేసులు నమోదు చేసి బాధ్యులను అరెస్టు చేశామన్నారు. ధరణి అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తున్నామని వెల్లడించారు. ధరణి సమస్యలతో ఇబ్బంది పడ్డ వారికి భూభారతితో పరిష్కారం చూపించామన్నారు. రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా మిలిగిన అన్ని జిల్లాల్లో సెకండ్ ఫేజ్ కింద క్వాలిఫై అయిన సర్వేయర్లకు నియామక పత్రాలు అందజేస్తామన్నారు. సర్వేయర్లందరికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రోవర్స్ ను అందిస్తామని, మొదటి విడత కింద ఇప్పటికే 600 పీసులను కొనుగోలు చేశామని వీటిని ఇప్పటికే కొన్ని జిల్లాలకు పంపిణీ చేశామని మిగిలిన జిల్లాలకు అతి త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు. ల్యాండ్ సర్వే కోసం ఇప్పటి వరకు ఉపయోగిస్తు విధానానికి ఫుల్ స్టాప్ పెట్టి రోవర్స్ విధానం తీసుకువస్తామన్నారు.

Post a Comment

0 Comments

Close Menu