Ad Code

ఇరాన్‌లో నిరసనల్లో పాల్గొనే వారిని 'మొహారెబ్'గా పరిగణిస్తాం !


రాన్‌లోని ఆందోళనకారులకు అటార్నీ జనరల్ మొహమ్మద్ మొవాహెది అజాద్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. నిరసనల్లో పాల్గొనే వారిని 'మొహారెబ్ (దేవుని శత్రువులు)'గా పరిగణిస్తామని, అలాంటి నేరానికి మరణశిక్ష వర్తిస్తుందని స్పష్టం చేశారు. నిరసనల్లో పాల్గొన్న వారే కాకుండా 'అల్లరిమూకలకు సహకరించిన వారు కూడా' ఇదే నేరానికి బాధ్యులవుతారని పేర్కొన్నారు. ఇరాన్ చట్టంలోని ఆర్టికల్ 186 ప్రకారం, ఇస్లామిక్ రిపబ్లిక్‌కు వ్యతిరేకంగా ఆయుధాలతో పోరాడే ఏ సంస్థకైనా మద్దతు ఇచ్చిన వారు మొహారెబ్‌గా పరిగణించబడతారని తెలిపారు. ఇరాన్ శిక్షా నియమావళిలోని ఆర్టికల్ 190 ప్రకారం, 'మొహారెబ్' నేరానికి అత్యంత కఠిన శిక్షలు ఉన్నాయి. మరణశిక్ష, ఉరి, కుడి చేయి-ఎడమ కాలి తొలగింపు, శాశ్వత అంతర్గత నిర్బంధం లాంటి శిక్షలు విధించే అవకాశం ఉందని చట్టం పేర్కొంటుంది. అమెరికా హెచ్చరికలను లెక్క చేయకుండా టెహ్రాన్ సర్కార్ ఈ కఠిన చర్యలకు సిద్ధమైంది. ప్రాసిక్యూటర్లకు జారీ చేసిన ఆదేశాల్లో దేశంలో అస్థిరత సృష్టించి, విదేశీ ఆధిపత్యానికి మార్గం వేయాలనుకునే వారిపై విచారణ ఆలస్యం చేయకుండా, ఎలాంటి కనికరం లేకుండా దర్యాప్తు చేయాలని తెలిపారు. 

Post a Comment

0 Comments

Close Menu