భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ పిడుగు వేసేందుకు సిద్ధమయ్యారు.యూఎస్ సెనెటర్ లిండ్సే గ్రాహం రూపొందించిన శాంక్షనింగ్ ఆఫ్ రష్యా యాక్ట్- 2025 కు ట్రంప్ మద్దతు ప్రకటించారు. ఈ కొత్త బిల్లు ప్రకారం రష్యా నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని వస్తువులు, సేవలపై కనీసం 500 శాతం సుంకం విధించనున్నారు. రష్యా, దాని సాన్నిహిత్య దేశాలైన బ్రెజిల్, చైనాతో పాటు భారత్‌పై 500 శాతం టారిఫ్ విధించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగే భారత్-అమెరికాల మధ్య వాణిజ్య,వ్యాపార సంబంధాలు దెబ్బతింటాయని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా పరోక్షంగా సహకరిస్తూ చమురును కొనుగోలు చేస్తున్న దేశాలపై చర్యలు తీసుకునేందుకు అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా శాంక్షనింగ్ ఆఫ్ రష్యా యాక్ట్- 2025కును రూపొందిస్తుంది. ఆ చట్టంపై యూఎస్ సెనెటర్ లిండ్సే గ్రాహం నెలల తరబడి పని చేస్తున్నారు. తాజాగా, చట్టం రూపకల్పన తుది అంకానికి చేరడంతో ఆయన ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రష్యాను ఆర్థికంగా ఇబ్బంది పెట్టే బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు లిండ్సే గ్రాహం ధృవీకరించారు
0 Comments