Ad Code

42 కేజీలు పట్టుకున్న పాల్వంచ పోలీసులు : ఐదుగురు అరెస్టు


తెలంగాణ లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పోలీసులు 42 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ మేరకు పూర్తి వివరాలను పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. గురువారం సాయంత్రం సుమారు 6-30 గంటల సమయంలో పాల్వంచ బస్టాండ్ లో చేతిలో బ్యాగులు పట్టుకుని ఉన్న ఐదుగురు అనుమానితులను సోదా చేయగా వారి వద్ద సుమారు 42 కేజీల గంజాయి దొరికింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారందరూ చెన్నై నుంచి భద్రాచలంకి వచ్చి ఇక్కడ శ్రీను అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుక్కుని వెళుతూ మధ్యలో పాల్వంచలో దిగి, జంగారెడ్డిగూడెం వెళ్ళే బస్ కోసం వేచి చూస్తుండగా పాల్వంచ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ భద్రాచలంలో తక్కువ ధరకి గంజాయి కొనుక్కుని వెళ్లి, చెన్నైలోని నరేందర్ అనే వ్యక్తికీ ఎక్కువ ధరకి అమ్ముతుంటారు. పట్టుబడిన వారిలో తమిళనాడుకు చెందిన ఝాన్సీ అయ్యప్పన్, ధనలక్ష్మి సురేష్, వనిత గణేష్, వలియమ్మ షణ్ముగం, శ్రీనివాసన్ మనికండన్ లు ఉన్నారు. తమిళనాడుకు చెందిన నరేందర్, విజయవాడకు చెందిన శ్రీను లు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. వీరి వద్ద నుండి 42 కేజీల గంజాయి, ఐదుసెల్ ఫోన్లు స్వాధీన పరుచుకున్నారని చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu