Ad Code

సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు లొంగుబాటు !


త్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో పోలీసు యంత్రాంగం, సీఆర్ఫీఎఫ్ అధికారుల సమక్షంలో 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. జనజీవన స్రవంతిలోకి రావాలన్న ప్రభుత్వ పిలుపు, పోలీసుల 'పూన నర్కోమ్' (కొత్త ఉదయం) ప్రచార కార్యక్రమానికి ఆకర్షితులై వీరంతా ఆయుధాలు వీడారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వారు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరి ప్రస్థానంపై ప్రభుత్వం గతంలోనే భారీ రివార్డులను ప్రకటించింది. లొంగిపోయిన 26 మందిపై కలిపి ప్రభుత్వం 64 లక్షల రూపాయల రివార్డును ప్రకటించింది. వీరంతా మావోయిస్టు పార్టీకి చెందిన మార్వార్ డివిజన్ మరియు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమిటీ సభ్యులుగా గుర్తించబడ్డారు. మావోయిస్టు భావజాలం పట్ల విరక్తి చెంది, అభివృద్ధి వైపు మొగ్గు చూపుతూ వీరంతా లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్షణ సహాయం అందించి, పునరావాసం కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.


Post a Comment

0 Comments

Close Menu