Ad Code

242 బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ వెబ్‌సైట్‌ను బ్యాన్‌ చేసిన కేంద్ర ప్రభుత్వం


242 బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ వెబ్‌సైట్‌ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్‌ చేసింది. ఇప్పటివరకు మొత్తంగా 7800 వెబ్‌సైట్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్‌ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ కారణంగా జరుగుతున్న ఆర్థిక ఇతర రకాల మోసాలను కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం అక్టోబర్‌ నెలలో ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్‌ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారమే తాజాగా భారీ సంఖ్యలో గేమింగ్‌, గ్యాంబ్లింగ్‌ వెబ్‌సైట్‌లపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులను టార్గెట్‌ చేస్తూ, ఈ వెబ్‌సైట్లు ఆగడాలకు పాల్పడుతున్నాయి. ఆశపెట్టి.. మోసాలకు పాల్పడుతున్నాయి. దీంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి, ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక మోసాల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడం సహా కాపాడుకోవడంలో భాగంగా ఇటీవల ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. అక్టోబర్ 1 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ప్రజలు కూడా ఈ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu