Ad Code

టీ20 ప్రపంచకప్‌-2026 : భారతీయ మూలాలున్న ఆటగాళ్లకు విదేశీ జట్లలో ప్రాధాన్యత !


టీ20 ప్రపంచకప్‌-2026 కోసం రెండు విదేశీ జట్లకు భారత మూలాలున్న ఆటగాళ్లు కెప్టెన్లుగా నియమితులయ్యారు. ఒమన్‌ జట్టు కెప్టెన్‌గా జతిందర్‌ సింగ్‌, కెనడా జట్టు కెప్టెన్‌గా దిల్‌ప్రీత్‌ బజ్వా ఎంపికయ్యారు. వీరి జట్లలో భారతీయుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఒమన్‌ జట్టులో సగానికి పైగా భారత మూలాలున్న ఆటగాళ్లే కాగా, తాజాగా ప్రకటించిన కెనడా జట్టులో సైతం అదే స్థాయిలో భారతీయులు ఉన్నారు. వీరే కాక ప్రపంచకప్‌ కోసం ఇప్పటివరకు ప్రకటించిన జట్లలో మరికొంత మంది భారతీయ మూలాలున్న ఆటగాళ్లు ఉన్నారు. న్యూజిలాండ్‌ జట్టులో ఐష్‌ సోధి, రచిన్‌ రవీంద్ర, నెదర్లాండ్‌ జట్టులో ఆర్యన్‌ దత్‌, సౌతాఫ్రికా జట్టులో కేశవ్‌ మహారాజ్‌ లాంటి భారత మూలాలున్న ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారతీయ మూలాలున్న ఆటగాళ్లకు ప్రాతినిథ్యం లభిస్తుంది. ఈ మెగా టోర్నీ కోసం యూఎస్‌ఏ జట్టును ప్రకటించాల్సి ఉంది. ఈ జట్టుకు సైతం భారత మూలాలున్న మిలింద్‌ కుమార్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ జట్టులో సైతం​ చాలామంది భారతీయులు ఉన్నారు. ఇదిలావుండగా, భారత్‌, శ్రీలంక వేదికలుగా జరుగనున్న టీ20 ప్రపంచకప్‌-2026 కోసం 15 మంది సభ్యుల కెనడా జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా దిల్‌ప్రీత్ బజ్వా ఎంపికయ్యాడు. ఈ జట్టులో చాలామంది భారత మూలాలున్న ఆటగాళ్లు ఉన్నారు. మెగా టోర్నీలో కెనడా ప్రయాణం ఫిబ్రవరి 9న సౌతాఫ్రికా మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ టోర్నీలో కెనడా యూఏఈ, న్యూజిలాండ్‌, ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు గ్రూప్‌-డిలో ఉంది. మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది.


Post a Comment

0 Comments

Close Menu