Ad Code

త్వరలో ఐక్యూ 15R విడుదల !


దేశీయ మార్కెట్లో త్వరలో ఐక్యూ 15R విడుదల కానున్నది. ఇటీవలే సంస్థ దీన్ని ధ్రువీకరించింది. అయితే ఎప్పుడు విడుదల కానుందనే వివరాలను మాత్రం వెల్లడి కాలేదు. కేవలం డిజైన్‌ మాత్రమే వెల్లడయింది. ఈ ఫోన్‌ గీక్‌బెంచ్‌లో లిస్టింగ్‌ అయినట్లు తెలిసింది. టిప్‌స్టర్‌ అభిషేక్‌ యాదవ్‌ ఈ వివరాలను వెల్లడించారు. ఈ ఐక్యూ 15R స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలను X హ్యాండిల్‌ ద్వారా టిప్‌స్టర్‌ షేర్‌ చేశారు. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ లిస్టింగ్‌ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 16 OS ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ Adreno 829 GPU ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల చైనా మార్కెట్‌లో విడుదల అయిన ఐక్యూ Z11 టర్బో మోడల్‌కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా ఐక్యూ 15R స్మార్ట్‌ఫోన్‌ వస్తుందని తెలుస్తోంది. దీనిలో 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.59 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేలతో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని సమాచారం. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 200MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్, 32MP సెల్ఫీ కెమెరాతో లాంచ్‌ అవుతుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ 100W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7600mAh బ్యాటరీతో లాంచ్ కానుంది. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలపై ఐక్యూ ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు. దీంతోపాటు విడుదల తేదీని కూడా వెల్లడించలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది

Post a Comment

0 Comments

Close Menu