12 ఏళ్ల తరువాత ఫిఫా ప్రపంచకప్ భారత్‌లో అడుగు పెట్టింది. ఈ ట్రోఫీ టూర్ 30 దేశాల్లో, 75 స్టాప్‌లతో 150 రోజుల పాటు సాగుతుంది. కోకా-కోలా భాగస్వామ్యంతో ఈ ట్రోఫీ టూర్ జరుగుతుంది. న్యూఢిల్లీలోని తాజ్ మహల్ హోటల్‌లో ప్రతిష్టాత్మకమైన ఈ ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర యువజన, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవియా, బ్రెజిల్ మాజీ వరల్డ్ కప్ విజేత గిల్బర్టో డి'సిల్వా, క్రీడా చరిత్రకారుడు బోరియా మజుందార్, కోకా-కోలా ఇండియా నాయకత్వం హాజరయ్యారు. మంత్రి మాండవియా మాట్లాడుతూ ప్రధాని మోడీ నాయకత్వంలో క్రీడలు జాతీయ ప్రాధాన్యతగా మారాయి. 2047 నాటికి భారత్‌ను ప్రపంచంలోని టాప్ ఐదు క్రీడా దేశాల్లో ఒకటిగా నిలపడం మా లక్ష్యం అని అన్నారు. కోకా-కోలా ఇండియా అధ్యక్షుడు సంకేత్ రే మాట్లాడుతూ భారత క్రీడలు విస్తృత భాగస్వామ్యం, బలమైన మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ అనుసంధానం ద్వారా కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయి. ఫిఫాతో మా దీర్ఘకాలిక భాగస్వామ్యం వల్ల ఇలాంటి చారిత్రాత్మక క్షణాలను భారత అభిమానులకు చేరువ చేస్తున్నామని అన్నారు.
0 Comments