సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లీ

Telugu Lo Computer
0


సింహాచలం లోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని క్రికెటర్ విరాట్ కోహ్లీ దర్శించుకున్నారు. విశాఖపట్నంలో జరిగిన భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో వన్డేలో విజయం సాధించిన సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకున్నట్లు సమాచారం. ఆలయ అధికారులు కోహ్లీకి ఘన స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శన అనంతరం, కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default