సహకార బ్యాంకుల మనుగడకు దేవస్థానం డబ్బును ఉపయోగించరాదని కేరళ హైకోర్టు వెల్లడించింది. దేవస్థానం డిపాజిట్లను తిరిగి ఇవ్వాలన్న కేరళ హైకోర్టు ఆదేశాలను కేరళ సహకార బ్యాంకులు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. దీనిపై తాజాగా సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయస్థానం తీర్పులో కేరళ హైకోర్టు తీర్పులో తప్పేమీ లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ 'సహకార బ్యాంకుల్ని కాపాడటం కోసం గుడి డబ్బుల్ని వాడతారా ? దేవుడి డబ్బుల్ని కేవలం గుడి ప్రయోజనాల కోసం మాత్రమే వాడాలి. అది ఆదాయ మార్గం కాకూడదు. సహకార బ్యాంకుల్ని కాపాడే మార్గం అస్సలు కాకూడదు. సహకార బ్యాంకులు ప్రజల నమ్మకాన్ని పొందాలి. కస్టమర్లను ఆకర్షించలేకపోవటం, డిపాజిట్లు తెచ్చుకోలేకపోవటం అన్నది సహకార బ్యాంకుల సమస్య' అని అన్నారు. అనంతరం సుప్రీం న్యాయస్థానం తన తీర్పులో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
0 Comments