హైదరాబాద్ లోని అమీర్ పేట మైత్రీవనం సమీపంలో ఉన్న అన్నపూర్ణ బ్లాక్ లో వున్న శివమ్ టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్ లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. రెండో అంతస్తు నుండి దట్టంగా పొగలు వ్యాపించాయి. ప్రమాదం తరవాత విద్యార్థులను బయటకు పంపించారు. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అదించడంతో వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. బ్యాటరీలు పేలడం వల్లనే మంటలు వ్యాపించినట్టు ప్రాథమిక సమాచారం.
0 Comments