అమెజాన్ సంస్థ యూరప్ లోని లక్సెంబర్గ్ ప్రధాన కార్యాలయంలో పెద్ద ఎత్తున లేఆఫ్స్ కు సిద్ధమైంది. రాబోయే కొన్ని వారాల్లో కార్యాలయంలో 370 మంది ఉద్యోగులను తొలగించబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం లక్సెంబర్గ్‌లో అమెజాన్‌కు సుమారు 4,370 మంది ఉద్యోగులు ఉన్నారు. గత అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా 14,000 ఉద్యోగులను తొలగించనున్నట్లు అమెజాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సంస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని పెంచడం, వ్యయాలను తగ్గించుకోవడం కోసం ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. దీని వల్ల సాఫ్ట్‌వేర్ డెవలపర్లు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని సమాచారం. కేవలం 6.8 లక్షల జనాభా ఉన్న దేశంలో ప్రత్యామ్నాయ ఉద్యోగాలు దొరకడం కష్టమవుతుందని అక్కడి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉండగా, కోవిడ్ సమయంలో భారీగా నియామకాలు చేపట్టిన అమెజాన్, 2022-2023 మధ్య ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సుమారు 27 వేల మంది ఉద్యోగులను తొలగించింది.
0 Comments