డిఫెన్స్ విభాగంలో పనిచేస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ నుంచి దీపక్ కుమార్ శర్మ రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా అతడ్ని అరెస్ట్ చేశారు. నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరకు డిసెంబర్ 19 న ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ ఎక్స్‌పోర్ట్స్‌లో డిప్యూటీ ప్లానింగ్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్న దీపక్ కుమార్ శర్మతోపాటుగా అతని సతీమణి కల్నల్ కాజల్ బాలీ, అలాగే దుబాయ్ కు చెందిన ఓ కంపెనీపై నేరపూరిత కుట్ర, లంచం ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేశారు. అతనితోపాటు ఓ ప్రైవేట్ వ్యక్తి అయిన వినోద్ కుమార్ ను కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీలోని దీపక్ కుమార్ శర్మ ఇంటిలో రైడ్ నిర్వహించిన అధికారులు సోదాలు జరిపి భారీ మొత్తంలో డబ్బును గుర్తించారు. రూ. 2.36 కోట్లను సీజ్ చేశారు. అలాగే శ్రీ గంగానగర్ లో ఉన్న దీపక్ కుమార్ శర్మ సతీమణి ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన అధికారులు రూ. 10 లక్షలు సీజ్ చేశారు. డిఫెన్స్ విభాగంలో కల్నల్ స్థాయి అధికారి ఇలాంటి పనులు చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మ, వినోద్ కుమార్ లను అరెస్ట్ చేసిన వెంటనే సీబీఐ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. దాంతో కోర్టు వీరిద్దరికీ ఈ నెల 23 వరకూ పోలీస్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఈ ఘటనపై లోతుగా విచారించనున్నారు అధికారులు. అయితే నిఘా వర్గాల సమాచారం మేరకు లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మ తోపాటుగా అతని సతీమణి కల్నల్ కాజల్ బాలీ, అలాగే దుబాయ్ కు చెందిన ఓ కంపెనీపై నేరపూరిత కుట్ర, లంచం ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేశారు. లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మ కొన్నేళ్లనుంచి లంచం, చట్టరీత్యా నేరమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పలుమార్లు ఫిర్యాదులు అందడంతో అతడిపై అధికారులు నిఘా ఉంచారు. ఢిల్లీ, శ్రీ గంగానగర్ లోని దీపక్ కుమార్ శర్మ ఇళ్లపై రైడ్స్ నిర్వహించి సోదాలు జరిపిన అధికారులు రూ. రూ. 2.36 కోట్లను అలాగే మరోచోట రూ. 10 లక్షలు సీజ్ చేశారు.
0 Comments