అమెరికాలోని హవాయిలోన కిలౌయా అగ్నిపర్వతం మరోసారి విస్ఫోటనం చెందింది. అగ్నిపర్వతం నుంచి భారీ ఎత్తున లావా ఎగిసిపడుతోంది. 100 అడుగుల ఎత్తు వరకు లావా చిమ్ముతోంది. ప్రపంచంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాలలో ఒకటైన కిలౌయా విస్ఫోటనం 2024 డిసెంబర్ 23న ప్రారంభమైంది. ఇప్పటి వరకు 38 సార్లు బద్ధలైంది. ఉత్తర వాయువ్య భాగం నుంచి ప్రస్తుతం సుమారు 50-100 అడుగులు (15-30 మీటర్లు) ఎత్తులో నిరంతర లావా ఎగసిపడతోందని యూఎస్ జియోలాజికల్ సర్వీసెస్ హవాయియన్ వల్కానో అబ్జర్వేటరీ ఒక ప్రకటనలో వెల్లడించింది. అగ్నిపర్వత వాయువు, బూడిద వల్ల స్థానిక విమానాశ్రయాలు ప్రభావితమయ్యే అవకాశం లేదని అధికారులు పేర్కొన్నారు.
0 Comments